ఏపీకి తప్పిన తుపాను ముప్పు
- తుపానుగా రూపాంతరం చెందని బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం
- ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడి
- వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం
రేపు (శనివారం) ఉదయం కల్లా కారైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని పేర్కొన్నారు. అయితే, తుపాను ముప్పు లేకున్నా వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావొచ్చని హెచ్చరించింది.