కారు నడిపిన కేసీఆర్... రంగంలోకి వస్తున్నారంటూ కామెంట్లు
- అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్‌ఎస్ పార్టీ
- కొంతకాలం నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌజ్ కే పరిమితమైన కేసీఆర్
- బీఆర్‌ఎస్ గుర్తు ‘కారు’ కావడంతో.. ఇక కారు జోరేనంటూ కామెంట్లు
ఇక ‘కారు’దే జోరు...
కేసీఆర్ స్వయంగా కారు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గడం, లోక్ సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినడంతో ... బీఆర్‌ఎస్ పార్టీలో కొంత స్తబ్దత నెలకొంది. ఈ క్రమంలో త్వరలోనే కేసీఆర్ తెరపైకి వస్తారని ప్రచారం జరుగుతోంది. దానికి ఈ కారు నడిపిన వీడియోతో మరింత ఉత్సాహం వచ్చింది. బీఆర్‌ఎస్ పార్టీ చిహ్నం ‘కారు’ను గుర్తు చేస్తూ... కేసీఆర్ కారు నడపడాన్ని ప్రస్తావిస్తూ... ఇక భవిష్యత్తులో ‘కారు’ జోరు అందుకుంటుందంటూ కామెంట్లు వస్తున్నాయి.