బ్రెడ్ తినడాన్ని జగన్ ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి: ఆనం వెంకటరమణారెడ్డి
- అదానీ విద్యుత్ వ్యవహారంలో జగన్ కు 200 మిలియన్ డాలర్ల లంచం ముట్టిందన్న ఆనం
- ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకునే అవకాశం లేదని వ్యాఖ్య
- అమెరికా జైళ్లలో బ్రెడ్, జామ్ మాత్రమే ఇస్తారన్న ఆనం
అమెరికాలో నమోదైన ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకునే అవకాశం లేదని ఆనం అన్నారు. కమీషన్లు ముట్టేసరికి అర్ధరాత్రి ఫైళ్లు పరిగెత్తుకుంటూ అప్పటి మంత్రి బాలినేని ఇంటికి వెళ్లాయని... అయితే ఏదో లొసుగు ఉందని భావించిన బాలినేని సైడ్ అయిపోయారని చెప్పారు.
అమెరికా జైళ్లలో బ్రెడ్, జామ్ మాత్రమే ఇస్తారని... జగన్ ఇప్పటి నుంచే బ్రెడ్ తినడం అలవాటు చేసుకోవాలని ఆనం ఎద్దేవా చేశారు. వైఎస్ భారతమ్మ ఇంట్లో తయారు చేసిన చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ జైలుకు తీసుకెళ్లే అవకాశం ఉండదని వ్యంగ్యం ప్రదర్శించారు.