Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పుష్ప' న‌టుడు శ్రీతేజ్‌పై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు!

Case Registered on Pushpa Actor Sritej
Advertisement
  • పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ శ్రీతేజ్‌పై యువతి ఫిర్యాదు
  • కూకట్‌పల్లి పోలీస్ స్టేష‌న్‌లో న‌టుడిపై కేసు నమోదు
  • లక్ష్మీస్‌ ఎన్టీఆర్, ధమాకా, పుష్ప, వంగవీటి, మంగళవారం, పుష్ప2 చిత్రాల్లో న‌టించిన శ్రీతేజ్
Advertisement
టాలీవుడ్‌ నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని అత‌నిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేర‌కు పోలీసులు శ్రీతేజ్‌పై బీఎన్‌ఎస్ 69, 115 (2), 318 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే, గ‌తంలోనూ శ్రీతేజ్‌పై ఇదే పీఎస్‌లో కేసు నమోదైంది. పెళ్ల‌యిన మ‌హిళ‌తో వివాహేత‌ర‌ సంబంధం కొన‌సాగించ‌డంతో ఆమె భ‌ర్త‌ గుండెపోటుతో మృతిచెందిన‌ట్టు అప్ప‌ట్లో వివాదం చెల‌రేగింది. 

కాగా, శ్రీతేజ్ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్' సినిమాలో చంద్ర‌బాబు రోల్ చేసిన విష‌యం తెలిసిందే. అలాగే 'ధమాకా', 'పుష్ప ది రైజ్‌', 'వంగవీటి', 'మంగళవారం', త‌దిత‌ర సినిమాలలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పుష్ప ది రూల్' చిత్రంలోనూ ఓ పాత్ర పోషించాడు.
Advertisement
Advertisement
Actor Sritej
Police Case
Tollywood

More Telugu News