లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
- లగచర్ల ఘటనలో మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు
- వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేసిన నరేందర్ రెడ్డి
- విచారణ ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
ఒకే సంఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయవద్దన్న సుప్రీంకోర్టు తీర్పులను పట్నం నరేందర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు, ఈ కేసులకు సంబంధించిన వివరాలను ఏఏజీ కోర్టుకు వివరించారు. పోలీసులు వేర్వేరు కేసులు ఎందుకు నమోదు చేశారో తెలిపారు. ఈరోజు వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.