Pawan Kalyan: మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ప్రభంజనం.. ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ ముందంజ
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి క్లియర్ మెజర్టీ దిశగా సాగుతోంది. ఝార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి లీడ్ లో ఉంది. మరోవైపు, మహారాష్ట్రలో జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్డీయే కూటమి తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. పూణె, బల్లార్ పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్, నాందేడ్, విదర్భ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ స్థానాలన్నింటిలోనూ బీజేపీ ఆధిక్యతలో ఉంది. పవన్ ప్రచారం నిర్వహించిన సమయంలో ఆయన ర్యాలీలకు జనాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణాలు చప్పట్లు, విజిల్స్ తో మారుమోగాయి.