టాలీవుడ్ లో ఇవాళ 10 సినిమాల రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాలీవుడ్ లో ఇవాళ 10 సినిమాల రిలీజ్

10 movies scheduled to release on november 22ed
  • సినిమాల విడుదలలో అతివృష్టి లేకపోతే అనావృష్టి
  • నేడు రిలీజ్ కు సిద్దమైన పది సినిమాలు
  • రోటి కపడా రొమాన్స్, ఝాన్సీ ఐపీఎస్ మూవీలకు థియేటర్లు లేక వచ్చే వారానికి వాయిదా
ప్రతి శుక్రవారం వివిధ భాషా చిత్రాలు విడుదల అవుతుంటాయి. శుక్రవారం వస్తుంది అంటే కొత్తగా ఏ సినిమాలు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. అయితే సినిమాల విడుదల అతివృష్టి లేకుంటే అనావృష్టిగా తెలుగు సినీ ఇండస్ట్రీ పరిస్థితి తయారైంది. వస్తే వరుసపెట్టి సినిమాలు విడుదల అవుతాయి, లేకుంటే ఒక్క మూవీ కూడా విడుదల కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

ఈ రోజు (శుక్రవారం, నవంబర్ 22) ఏకంగా పది సినిమాలు విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. గత వారం అంటే నవంబర్ 14న ఒక డబ్బింగ్ సినిమా కంగువాతో పాటు మరో స్ట్రయిట్ తెలుగు మూవీ 'మట్కా' మాత్రమే విడుదల అయ్యాయి. ఆ రోజు విడుదల కావాల్సిన 'దేవకీ నందన వాసుదేవ' మూవీ ఈ వారానికి వాయిదా వేశారు. అలా వాయిదా వేయకుండా ఉంటే ఏమైనా వర్కౌట్ అయ్యేదేమోననే టాక్ నడుస్తోంది. ఎందుకంటే గత వారం విడుదలైన రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ రోజు మొత్తానికి ఏకంగా పది సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.
 
ఇందులో విష్వక్సేన్ హీరోగా నటించిన 'మెకానిక్ రాకి', అశోక్ గల్లా హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ', సత్యదేవ్ హీరోగా నటించిన 'జీబ్రా', రాకింగ్ రాకేశ్ హీరోగా నటిస్తున్న 'కేశవ చంద్ర రమావత్' (కేసీఆర్) మూవీలు కాస్త చెప్పుకోదగ్గవి ఉన్నాయి. ఇవి కాకుండా 'రోటి కపడా రొమాన్స్' అనే మూవీ, 'ఉద్వేగం' మూవీ, 'పిచ్చోడు', 'ఝాన్సీ ఐపీఎస్', 'కనకమహాలక్ష్మి' లాంటి సినిమాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి. అదే విధంగా తమిళంలో విడుదల అయి తెలుగులో ఇప్పుడు డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతున్న సన్నీ లియోన్ సినిమా 'మందిర' కూడా వుంది. అయితే వీటిలో 'రోటి కపడా' రొమాన్స్ సినిమాతో పాటు 'ఝాన్సీ ఐపీఎస్' అనే రెండు సినిమాలకు థియేటర్లు లేకపోవడంతో వచ్చే వారానికి వాయిదా వేశారు.   
Advertisement
Movie News
Tollywood

More Telugu News