ఉరేసుకున్న మహిళను సీపీఆర్ చేసి కాపాడిన కానిస్టేబుల్.. వీడియో ఇదిగో!
--
ఉరి బిగుసుకుపోవడంతో స్పృహ తప్పిన మహిళకు సీపీఆర్ చేశాడు. కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. ఈ లోగా రాంబాబు చేసిన సీపీఆర్ తో మహిళ తనకు తానుగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది. అంబులెన్స్ సిబ్బంది ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాంబాబుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.