తిరుమల దర్శనానికి సంబంధించి... టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి కేటీఆర్ విజ్ఞప్తి
- కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ నాయుడు
- తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి
- తెలంగాణ దేవాలయాలకు తోడ్పాటును అందించాలన్న కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు లేఖల విషయమై విజ్ఞప్తి చేశారు. అలాగే, కరీంనగర్, సిరిసిల్లలో గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా సహకరించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయని, వాటి అభివృద్ధికి టీటీడీ తరఫున తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తికి బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు.