Advertisement

అయ్యన్నపాత్రుడిపై కూడా ఫిర్యాదు చేశాం.. చర్యలు తీసుకోరా?: అంబటి రాంబాబు

Ambati Rambabu complaint on TDP tweets
  • జగన్ పై అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ అంబటి ఫిర్యాదు
  • ట్వీట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • లోకేశ్ చేసిన ట్వీట్లపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్న
వైసీపీ అధినేత జగన్, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారని గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ట్వీట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ పై గతంలో లోకేశ్ చేసిన అనుచిత ట్వీట్లపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. లోకేశ్ ట్వీట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

జగన్ పై గతంలో అయ్యన్నపాత్రుడు కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేశారని... ఆయనపై కూడా ఫిర్యాదు చేశామని, చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని... న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.
Advertisement
Ambati Rambabu
YSRCP
Jagan

More Telugu News