హైదరాబాద్ లో ఐటీ దాడులు
- రూ. 300 కోట్ల విలువైన భూమిని అమ్మిన కంపెనీ
- లెక్కల్లో చూపకపోవడంతో ఐటీ అధికారుల రెయిడ్
- కంపెనీ యజమానుల ఇళ్లల్లో సోదాలు
షాద్ నగర్ ప్రాంతంలో రూ.300 కోట్ల విలువైన భూమిని మల్టీ నేషనల్ కంపెనీకి అమ్మింది. అయితే, ఈ లావాదేవీకి సంబంధించిన సొమ్మును స్వస్తిక్ గ్రూప్ తన బ్యాలెన్స్ షీట్ లో చూపించలేదు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు తాజాగా స్వస్తిక్ గ్రూప్ యజమానులు కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ ల నివాసాలతో పాటు షాద్ నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్ లోని ఇళ్లు, ఆఫీసులలో తనిఖీలు చేపట్టారు.