ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్
- రైతులు ధాన్యం విక్రయించేందుకు సులభమైన ప్రక్రియ
- వాట్సాప్ ద్వారా సేవలు
- రైతులు ధాన్యం విక్రయించేందుకు టైమ్ స్లాట్ విధానం
దీనిపై ఏపీ ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రైతులు తమ ధాన్యం విక్రయించే క్రమంలో వారికి సమయం వృథా కాకుండా ఈ వాట్సాప్ నెంబరును తీసుకువచ్చామని చెప్పారు. వాట్సాప్ ద్వారా రైతులు తమ ధాన్యం విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసుకోవచ్చని, నిర్దేశించిన సమయంలో వెళ్లి కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి ధాన్యం విక్రయించవచ్చని నాదెండ్ల వివరించారు.
ఈ వాట్సాప్ నెంబరు ద్వారా సేవలు పొందాలనుకునే రైతులు తొలుత తమ ఆధార్ కార్డుతో కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.