Hypersonic Missile: దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం.. 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యం తుత్తునియలు

India successfully tests first long range hypersonic missile
షార్ట్స్‌లో చూడండి
భారత్ తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ మిసైల్‌ను ఒడిశా తీరం నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షతో భారత రక్షణ రంగం మరింత బలోపేతమైనట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. వివిధ రకాల పేలోడ్లను మోసుకెళ్లేలా దీనిని డిజైన్ చేశారు. ఇది 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుత్తునియలు చేయగలదు. ఈ విజయంతో క్రిటికల్, అడ్వాన్స్‌డ్‌ మిలటరీ టెక్నాలజీ కలిగిన దేశాల చెంత భారత్ చేరినట్టు రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఇదొక చారిత్రక ఘట్టమని, ఈ విజయంతో అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. 

పరీక్ష అనంతరం మిసైల్ గమనాన్ని జాగ్రత్తగా పరీక్షించారు. డౌన్-రేంజ్ షిప్ స్టేషన్ల నుంచి సేకరించిన ఫ్లైట్ డేటా.. క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు నిర్ధారించిందని డీఆర్‌డీవో ప్రకటించింది. ఈ క్షిపణిని దేశీయంగా అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌లో డీఆర్‌డీవో ల్యాబరేటరీస్, ఇండస్ట్రీ పార్ట్‌నర్స్‌తో కలిసి సంయుక్తంగా రూపొందించారు. డీఆర్‌డీవో సీనియర్ శాస్త్రవేత్తలు, రక్షణ దళాల అధికారుల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించినట్టు డీఆర్‌డీవో తెలిపింది. 
Go Back to Shorts
Hypersonic Missile
DRDO
Hyderabad
Rajnath Singh

More Telugu News