ఫోన్ ట్యాపింగ్ కేసు.. బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్‌కు నోటీసులు
- కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు
- ఈ ఉదయం విచారణకు హాజరైన బీఆర్ఎస్ నేత
- ఇదివరకే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు
- ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురి కాల్ డేటాలు విశ్లేషిస్తూ నోటీసులు ఇస్తున్న పోలీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురి కాల్ డేటాలు విశ్లేషిస్తున్న పోలీసులు అందులోని వివరాల ఆధారంగా ఒక్కొక్కరికీ నోటీసులు ఇస్తూ విచారిస్తున్నారు.