న్యూజిలాండ్ పార్లమెంట్లో బిల్లును చించేసి... డ్యాన్స్ చేస్తూ మహిళా ఎంపీ నిరసన... వీడియో వైరల్
- నెట్టింట వైరల్గా మారిన వీడియో
- ట్రీటి ప్రిన్సిపిల్స్ బిల్లును చించేసిన మహిళా ఎంపీ
- తన స్థానం నుంచి పోడియం వరకు డ్యాన్స్ చేస్తూ నిరసన
పార్లమెంట్లో వివాదాస్పద ట్రీటీ ప్రిన్సిపుల్స్ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఆమె నిరసన చేపట్టారు. ఈ బిల్లును రెండు ముక్కలుగా చించేశారు.
ఆ తర్వాత మావోరి సంప్రదాయ నృత్యం చేశారు. గట్టిగా ఓ పాట పాడుతూ... డ్యాన్స్ చేస్తూ తన స్థానం నుంచి పోడియం దిశగా వస్తున్న వీడియో ఇది. ఆమెతో పాటు పలువురు సభ్యులు, గ్యాలరీలో ఉన్న వారు కూడా డ్యాన్స్ చేశారు. ఒకటిన్నర నిమిషాల ఈ వీడియోను కెల్విన్ మోర్గాన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.