25 లక్షల కోట్ల ఆస్తి.. ప్రపంచంలోనే రిచ్చెస్ట్​ ఫ్యామిలీ ఇది!

worlds richest royals al nahyan family wealth
  • వేల కోట్ల విలువ చేసే ప్యాలెస్ లు, భవనాలు
  • సొంతంగా ఎనిమిది జెట్ విమానాలు
  • అబుదాబికి చెందిన అల్ నహ్యన్ కుటుంబం ఆస్తులు ఎన్నో...
వేల కోట్ల విలువ చేసే ప్యాలస్... వందల కొద్దీ భవనాలు... సొంతంగా చమురు బావులు... ఎనిమిది ప్రైవేటు జెట్ విమానాలు... ఇలా ఒకటా రెండా. లక్షల కోట్ల ఆస్తులు ఆ కుటుంబం సొంతం. ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం అది. అదే అబుదాబికి చెందిన అల్ నహ్యన్ రాచ కుటుంబం. ఆ కుటుంబం మొత్తం ఆస్తులు 300 బిలియన్ డాలర్లకు పైనే. అంటే మన కరెన్సీలో చెప్పుకోవాలంటే 25 లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. 
  • అల్ నహ్యన్ కుటుంబం నివసించే రాజ భవనం ‘ఖసర్ అల్ వతన్’ ప్యాలెస్ విలువ 4 వేల కోట్లకుపైనే ఉంటుంది. అందులో ఉండే ఒక షాండ్లియర్ (సీలింగ్ నుంచి వేలాడే అలంకరణ)లో ఏకంగా 3.5 లక్షల రత్నాలు పొదిగి ఉండటం విశేషం. 
  • అల్ నహ్యన్ కుటుంబానికి లండన్, పారిస్ సహా ప్రపంచంలోని చాలా ప్రముఖ నగరాల్లో భారీ సంఖ్యలో భూములు, భవనాలు ఉన్నాయి.
  • ఈ కుటుంబంలోని వారు ప్రయాణించేందుకు.. దేశంలో, విదేశాలకు రాకపోకలు సాగించేందుకు సొంతంగా ఎనిమిది ప్రైవేటు జెట్ విమానాలు కొనుక్కుని వాడుకుంటున్నారు.
  • ఈ కుటుంబానికి సొంతంగా ఒక ఫుట్ బాల్ క్లబ్ కూడా ఉంది. దానితో ఫుట్ బాల్ లీగ్ లలో పోటీ పడుతుంటారు.
  • అల్ నహ్యన్ రాచ కుటుంబం అధీనంలో ఉన్న చమురు నిల్వలు... మొత్తం ప్రపంచంలోని అన్ని చమురు నిల్వల్లో ఏకంగా ఆరు శాతం కావడం గమనార్హం.
  • ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద కంపెనీల్లో ఈ కుటుంబానికి వాటాలు ఉన్నాయి.
  • ఈ కుటుంబానికి సంబంధించిన పెట్టుబడుల వ్యవహారాలను ‘టానౌన్ బిన్ జాయేద్ అల్ నహ్యన్’ చూసుకుంటారు.
  • ఈ కుటుంబానికి చెందిన షేక్ హమద్ బిన్ హందాన్ కు కార్లు అంటే ఇష్టం. ఆయన వద్ద బుగాటీ వేరాన్, లాంబోర్గిని, ఫెరారీ, మెక్ లారెన్ కంపెనీలు సహా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 700 కార్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటి విలువ ఒక్కోటీ రూ.5 కోట్లపైనే ఉంటుంది.


Go Back to Shorts
Richest family
offbeat
international
world news
money
Business News

More Telugu News