అమెరికా అధ్యక్షుడు బైడెన్ కంటతడి.. వీడియో ఇదిగో!
- అమరులైన సైనికులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగం
- వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్
- తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవం ఇదేనని వ్యాఖ్య
అనంతరం బైడెన్ మాట్లాడుతూ.. కమాండర్ ఇన్ చీఫ్ గా తాను ఇక్కడ నిలబడడం ఇదే చివరిసారని అన్నారు. జీవితంలో తనకు దక్కిన గొప్ప గౌరవం ఇదేనని చెప్పారు. తన కుమారుడు బ్యూ బైడెన్ కూడా ఇరాక్ లో ఏడాది పాటు పనిచేశాడని చెప్పారు. కాగా, బైడెన్ కుమారుడు బ్యూ బైడెన్ 2015 లో గ్లియోబ్లాస్టోమా వ్యాధి కారణంగా చనిపోయాడు.