Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైజాగ్ యాస‌లో అభిమానిని ఆట‌ప‌ట్టించిన చిరంజీవి.. ఇదిగో వీడియో!

Megastar Chiranjeevi Playfully Teased Fan in Zebra Movie Prerelease Event
Advertisement
  • జీబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన చిరంజీవి
  • చిరు మాట్లాడుతున్న స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌
  • బాసూ నిన్ను చూడాల‌ని వైజాగ్ నుంచి వ‌చ్చాన‌న్న అభిమాని 
  • ఉత్త‌రాంధ్ర యాస‌లో స‌మాధానం ఇచ్చి న‌వ్వులు పూయించిన చిరు
Advertisement
స‌త్య‌దేవ్‌, డాలీ ధ‌నంజ‌య ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈశ్వ‌ర్‌ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన తాజా చిత్రం జీబ్రా. ఈ నెల 22న ఈ మూవీ విడుద‌ల కానుంది. దీంతో చిత్రం యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. దీనిలో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. అయితే, వేదిక‌పై చిరు మాట్లాడుతున్న స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. విశాఖ‌ప‌ట్నం నుంచి వ‌చ్చిన ఓ మెగా అభిమాని 'బాసూ నిన్ను చూడాల‌ని వైజాగ్ నుంచి వ‌చ్చాను' అని గ‌ట్టిగా అరిచాడు. 

అది విన్న మెగాస్టార్.. ఆ అభిమానిని వైజాగ్ యాస‌లోనే ఆట‌ప‌ట్టించారు. "అయితే ఏటంటావ్ ఇప్పుడు.. నువ్వు వైజాగ్ నుంచి వ‌చ్చినందుకు సంతోష‌మే.. మ‌రి ఈ బొమ్మ‌ను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి. భలేవాడివే..మ‌న హీరోది కూడా అదే ఊరు" అంటూ చిరు ఉత్త‌రాంధ్ర యాస‌లో మాట్లాడ‌డంతో వేదిక మొత్తం చ‌ప్ప‌ట్ల‌తో మారుమోగింది. అక్క‌డున్న‌వారంతా చిరంజీవి టైమింగ్‌కి న‌వ్వుతూ ఎంజాయ్ చేశారు. దీని తాలూకు వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దీనిపై అభిమానులు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.  
Advertisement
Advertisement
Chiranjeevi
Zebra Movie
Tollywood

More Telugu News