ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరు ఖరారైంది. మంగళవారం ఆయన పేరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. పలువురు నేతల పేర్లను పరిశీలించిన అనంతరం చివరకు ఆర్ఆర్ఆర్ వైపే చంద్రబాబు మొగ్గుచూపారు.
బుధ, గురువారాల్లో డిప్యూటీ స్పీకర్ పదవికి నోటిఫికేషన్ విడుదల కానుంది. మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే కూటమి ఎమ్మెల్యేలు ఆయన్ను ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఆర్ఆర్ఆర్ ఎన్నిక ఇక లాంఛనమే అని చెప్పాలి.
ఇక తాజా ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అంతకుముందు 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీచేసి గెలిచారు. 2024 ఎన్నికలకు ముందు ఆర్ఆర్ఆర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.