గర్భగుడి ముందే పూజారుల ఫైటింగ్.. ఏపీలోని ఆలయంలో ఘటన.. వీడియో ఇదిగో!
- అన్నమయ్య జిల్లా తలకోన ఆలయంలో వివాదం
- విధుల నిర్వహణ విషయమై పూజారుల మధ్య వాగ్వాదం
- ఈ నెల 10 న ఘటన.. సీసీటీవీ ఫుటేజ్ బయటపడడంతో వైరల్
కార్తీకమాసం సందర్భంగా తలకోన ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో గర్భగుడిలో పూజలు చేస్తే సంభావన ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో ఇద్దరు పూజారులు పోటీ పడ్డారు. ఈ రోజు పూజలు నిర్వహించే బాధ్యత తనదంటే తనదని గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇంతలో అక్కడున్న భక్తులు వచ్చి పూజారులను విడదీశారు. ఈ నెల 10న ఈ గొడవ జరగగా.. తాజాగా ఆలయంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ బయటకు వచ్చింది.