విమానం ల్యాండవుతుండగా కాల్పులు.. హైతీలో ఘటన
- తిరిగి గాల్లోకి లేచిన విమానం పొరుగు దేశంలో ల్యాండింగ్
- విమానానికి తగిలిన బుల్లెట్లు.. సిబ్బందికి గాయాలు
- గ్యాంగ్ వార్ తో అట్టుడుకుతున్న హైతీ
స్పిరిట్ ఎయిర్ వేస్ కు సంబంధించిన ఓ ఫ్లైట్ ఫ్లోరిడా నుంచి హైతీకి బయలుదేరింది. సోమవారం ఉదయం హైతీ రాజధానిలోని పోర్ట్ ఔ ప్రిన్స్ లో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. దాదాపు వంద అడుగుల ఎత్తుకు చేరుకున్నాక సడెన్ గా భూమి మీద నుంచి విమానంపైకి కాల్పులు జరిగాయి. బుల్లెట్లు తగిలి విమానం దెబ్బతింది. దీంతో విమానాన్ని మళ్లీ పైకి లేపిన పైలట్.. హైతీకి పొరుగున ఉన్న డొమినికన్ రిపబ్లికన్ కు మళ్లించాడు. అక్కడ సేఫ్ గా దించాక చూస్తే విమానం బయటా లోపలా బుల్లెట్స్ తగిలిన గుర్తులు కనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.