ఈ నెల 18న టీటీడీ నూతన పాలకమండలి సమావేశం
- ఇటీవల టీటీడీ పాలకమండలిని నియమించిన కూటమి ప్రభుత్వం
- 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో బోర్డు
- చైర్మన్ గా బీఆర్ నాయుడు నియామకం
- తొలిసారిగా సమావేశమవుతున్న టీటీడీ నూతన పాలకమండలి
ఈ నేపథ్యంలో, టీటీడీ నూతన పాలకమండలి నవంబరు 18న తొలిసారిగా సమావేశంగా కానుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఉదయం 10.15 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.