హర్దీప్ సింగ్ నిజ్జర్ సన్నిహితుడైన ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్ దల్లా అరెస్ట్!
- ఓ కాల్పుల ఘటనలో కెనడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం
- భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో కీలక పరిణామం
- జనవరి 2023లో అర్ష్ దల్లాను ఉగ్రవాదిగా గుర్తించిన కేంద్ర హోంశాఖ
అర్ష్ దల్లా పంజాబ్లోని మోగా పట్టణానికి చెందినవాడు. తన భార్యతో కలిసి ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నాడని భారత భద్రతా సంస్థల నివేదికలు చెబుతున్నాయి. జనవరి 2023లో దల్లాను ఉగ్రవాదిగా గుర్తిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో దల్లా అరెస్ట్ పరిణామం చోటుచేసుకుంది. కాగా దౌత్య సంబంధాలు దెబ్బతినడానికి ఖలిస్థానీ టైగర్స్ ఫోర్స్ (కేటీఎఫ్) చీఫ్ హర్దీప్ నిజ్జర్ హత్య కారణమన్న విషయం తెలిసిందే.