Samantha: వాళ్లను తక్కువ అంచనా వేయకూడదు: సమంత

ప్రముఖ నటి సమంత తాజాగా నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయరాదని చెప్పింది. ఆడియన్స్ అన్ని అంశాలను గమనిస్తుంటారని, అందుకే నటీనటులు, టెక్నీషియన్స్ ఏం చేసినా బాధ్యతతో చేయాలని పేర్కొంది. 

తాను ఏదైనా అంశాన్ని చేపట్టినప్పుడు, అందుకు పూర్తి బాధ్యత తానే స్వీకరిస్తానని వెల్లడించింది. సినిమాల్లో పాత్రలను ఎంచుకోవడానికి కూడా ఇదే సూత్రాన్ని అనుసరిస్తానని, అందుకే తాను సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంటానని సమంత వివరించింది. వాణిజ్య ప్రకటనలు చేయాల్సి వచ్చినా, ఈ అంశానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. 

ముఖ్యంగా, మహిళలకు ప్రాధాన్యత ఉండే పాత్రలవైపు మొగ్గుచూపుతానని వెల్లడించింది.
Samantha
Audience
Citadel Honey Bunny
Web Series

More Telugu News