వచ్చే సంవత్సరానికి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

  • 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
  • జనవరి 1న సెలవు ప్రకటించిన ప్రభుత్వం
2025 ఏడాదికి గాను సాధారణ, ఐచ్ఛిక సెలవుల (ఆప్షనల్ హాలిడేస్) జాబితాను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ప్రభుత్వం సెలవును ప్రకటించింది. ఇందుకు బదులుగా ఫిబ్రవరి 10న రెండో శనివారాన్ని పనిదినంగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

Telangana
Holidays
Congress

More Telugu News