Sea Plane: సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం... శ్రీశైలంలో ల్యాండింగ్

Sea Plane trial run successful from Vijayawada to Srisalam
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో వాటర్ టూరిజంను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో, నేడు సీ ప్లేన్ ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు. 

విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ సీ ప్లేన్ విజయవంతంగా శ్రీశైలం వద్ద కృష్ణా జలాల్లో ల్యాండయింది. అక్కడ్నించి నీటిపైనే ప్రయాణిస్తూ శ్రీశైలంలోని బోటింగ్ జెట్టీ వద్దకు చేరుకుంది. టూరిజం, ఎయిర్ ఫోర్స్, ఏపీ పోలీస్, ఎస్టీఆర్ఎఫ్ అధికారులు ఈ ట్రయల్ రన్ ను పర్యవేక్షించారు. 

నేటి ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (నవంబరు 9) సీ ప్లేన్ ను విజయవాడ పున్నమి ఘాట్ నుంచి ప్రారంభించనున్నారు.
Go Back to Shorts
Sea Plane
Trial Run
Srisailam
Vijayawada
TDP-JanaSena-BJP Alliance

More Telugu News