బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్.. వీడియో ఇదిగో!
- బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌లో ఘటన
- బీఎంటీసీ డిపో 40లో డ్రైవర్‌గా పనిచేస్తున్న 39 ఏళ్ల కిరణ్
- బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
- ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్‌పై ప్రశంసలు
డ్రైవర్ కుప్పకూలడంతో బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్సును రాసుకుంటూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన బస్సులోని కండక్టర్ డ్రైవర్‌ను లేపే ప్రయత్నం చేస్తూనే డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి బస్సును సురక్షితంగా నిలిపివేశాడు. ఆ తర్వాత డ్రైవర్ కిరణ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బస్సును నిలిపివేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్‌ను ఆర్టీసీ అధికారులు ప్రశంసించారు.