డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా...?
- డైరెక్టర్ క్రిష్ రెండో వివాహంపై సోషల్ మీడియాలో వార్తలు
- రెండో వివాహం చేసుకోబోయేది వైద్యురాలేనని టాక్
- మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్న ఆమెకు 11 ఏళ్ల బాలుడు ఉన్నాడని సమాచారం
ఈ నేపథ్యంలో క్రిష్ మరో వివాహానికి సిద్ధం అవుతున్నారని, వచ్చే వారం వివాహ నిశ్చితార్ధ వేడుక జరగనుందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రిష్ రెండో వివాహం చేసుకోబోయేది కూడా వైద్యురాలేనని తెలుస్తోంది. అయితే ఆమెకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడని, ఆమె మొదటి భర్తతో డైవర్స్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే క్రిష్ రెండో వివాహానికి సంబంధించి అధికారికంగా సమాచారం లేదు.