లంచ్ బాక్స్ మరచిపోయారంటూ ఆఫీస్‌కు వెళుతున్న భర్తకు భార్య ఫోన్.. అదృష్టం తలుపు తట్టింది
- లంచ్‌కు ఏమైనా దొరుకుందేమోనని షాపుకు వెళ్లి లాటరీ టికెట్ కొన్న వ్యక్తి
- వరించిన రూ.25.24 కోట్ల అదృష్టం
- సంతోషంలో ఎగిరి గంతేసిన సాధారణ ఉద్యోగి
అయితే ఆ దుకాణం వద్ద అతడికి ‘మిలియనీర్ బక్స్’ స్క్రాచర్స్ గేమ్ లాటరీ కనిపించింది. గరిష్ఠ బహుమతి 3 మిలియన్ డాలర్లు అని రాసి ఉండడాన్ని చూశాడు. 60 డాలర్లు పెట్టి ఒక టికెట్ కొనుగోలు చేశాడు. కార్డు స్కాన్ చేసి చూస్తే డిస్‌ప్లేపై విజేత అని ఉంది. తొలుత నమ్మలేకపోయాడు. కాస్త తేరుకున్నాక ఆనందంతో ఎగిరి గెంతేశాడు. ‘‘నేను సాధారణంగా 30 డాలర్ల టిక్కెట్‌లను కొనుగోలు చేయను. ఇంతకు ముందు కొన్ని ఇతర స్క్రాచర్స్ టిక్కెట్‌లపై గెలిచి ఉండడంతో మళ్లీ 60 డాలర్లతో టికెట్ కొనాలని అనుకున్నాను. టికెట్‌ను స్కాన్ చేసి చూస్తే విజేత అని ఉంది’’ అని ఉద్యోగి అమితానందం వ్యక్తం చేశాడు.
తాను పూర్తిగా ఆశ్చర్యపోయానని, నమ్మలేకపోయానని ఆనందాన్ని పంచుకున్నాడు. వెంటనే భార్యకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పానని చెప్పాడు. భార్యను ఆట పట్టించడం తనకు అలవాటు అని, అందుకే లాటరీ గెలుచుకున్న విషయాన్ని నమ్మించడానికి కొంత సమయం పట్టిందని చెప్పాడు.