సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ను ప్రారంభిస్తున్న పవన్
- సనాతన ధర్మం కోసం పార్టీలో ప్రత్యేక వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు చెప్పిన పవన్
- సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
- మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న డిప్యూటీ సీఎం
శనివారం ఏలూరులోని జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘దీపం-2’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పవన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. దీపం-2 పథకంలో భాగంగా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను అందిస్తామని తెలిపారు. ప్రతి ఏడాది 1,08,39,286 మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారని వివరించారు. ఇందుకోసం ఏడాదికి రూ. 2,684 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పవన్ హెచ్చరించారు.