తొక్కిపట్టి నార తీస్తానన్న పవన్ ఇప్పటిదాకా ఎంతమందికి తీశారు?: రోజా
- వడమాలపేటలో బాలికపై హత్యాచారం జరిగిందన్న రోజా
- బాలిక తల్లిదండ్రులకు పరామర్శ
- చంద్రబాబు, పవన్, అనిత సిగ్గుపడాలంటూ విమర్శలు
ఆడవాళ్లను ఎవరైనా బాధపెడితే తొక్కిపట్టి నారతీస్తానని పవన్ గతంలో అన్నారని, ఇప్పటిదాకా 100 మంది ఆడబిడ్డలు ప్రాణాలు వదిలితే, ఎంతమందికి పవన్ నారతీశారో చెప్పాలని మండిపడ్డారు.
చేతిలో అధికారం ఉండి కూడా, నేరగాళ్లలో భయం కల్పించలేకపోతున్నారని రోజా వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం లైసెన్సులు ఇచ్చిందని, బెల్టు షాపులు కూడా తయారయ్యాయని... మద్యం మత్తులోనే అత్యాచారాలకు పాల్పడుతున్నారని అన్నారు.