రోడ్డు రోలర్ నడిపిన సీఎం చంద్రబాబు... వీడియో ఇదిగో!

CM Chandrababu drives Road Roller
  • ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన
  • నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన
  • వెన్నెలపాలెంలో రోడ్లు గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
  • రోడ్డు రోలర్ తో రహదారి చదును చేసిన వైనం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతోంది. నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు... నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వాస్తవానికి ఆయన నేడు విజయనగరం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆ పర్యటన రద్దయింది. విజయనగరం జిల్లా పురిటిపెంటలో రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే, ఈ కార్యక్రమం అనకాపల్లి జిల్లాకు మారింది. 

అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో చంద్రబాబు ఈ మధ్యాహ్నం గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు రోలర్ నడపడం విశేషం. 

నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తూ, ఓ ఇంట్లో సిలిండర్ డెలివరీ ఇచ్చి, స్వయంగా టీ తయారుచేసిన చంద్రబాబు... ఇవాళ మరింత ఆశ్చర్యానికి గురిచేస్తూ రోడ్డు రోలర్ డ్రైవర్ అవతారమెత్తారు. కొద్దిదూరం పాటు రోడ్డు రోలర్ నడిపి రోడ్డును చదును చేశారు. 

ఈ సందర్భంగా ఆయన వెంట రోడ్డు రోలర్ పై హోంమంత్రి అనిత కూడా ఉన్నారు. చంద్రబాబు తనదైన శైలిలో అందరికీ విక్టరీ సింబల్ తో అభివాదం చేస్తూ, రోడ్డు రోలర్ నడుపుకుంటూ ముందుకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
Advertisement
Chandrababu
Road Roller
Road Repair
Vennelapalem
TDP-JanaSena-BJP Alliance

More Telugu News