'ముఖ్యమంత్రి మార్పు' వ్యాఖ్యలపై స్పందించిన మల్లు రవి
- రేవంత్ రెడ్డి సీఎంగా మరో పదేళ్ల పాటు కొనసాగుతారన్న మల్లు రవి
- మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శ
- బీజేపీలోని విభేదాల నుంచి దృష్టి మరల్చేందుకు జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా
తమ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ఠ అన్నారు. బీజేపీలో చేయడానికి మహేశ్వర్ రెడ్డికి ఏ పనీ లేదని, అందుకే పగటి కలలు కంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీలో రోజురోజుకూ విభేదాలు ముదిరిపోతున్నాయన్నారు. వారి విభేదాల నుంచి అందరి దృష్టిని మరల్చేందుకు సీఎం మారతారంటూ జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.