ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. వాచ్‌మన్‌కు మరణశిక్ష
- ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘటన
- ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక
- నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం
- ఆపై బండరాయితో మోది హత్య
- నిందితుడిని దోషిగా తేల్చిన పోక్సో కోర్టు
- రూ. 1.25 లక్షల జరిమానాతోపాటు మరణశిక్ష విధింపు
ఈ కేసులో రజ్వీర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు డీఎన్ఏ పరీక్షలు, సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలం తర్వాత అతడే నిందితుడని తేల్చారు. తాజాగా ఈ కేసులో పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడిని దోషిగా తేల్చి రూ. 1.25 లక్షల జరిమానాతోపాటు మరణశిక్ష విధించారు. ఈ తీర్పు వెలువరిస్తున్న సమయంలో బాధితురాలి తండ్రి కోర్టులోనే వుండి, ధన్యవాదాలు తెలిపారు. ఇక నిందితుడు జైలుకు వెళ్లినప్పటి నుంచి అతడి కుటుంబ సభ్యులు అతనికి దూరంగా వున్నారు. ఒక్కసారి కూడా అతడిని చూసేందుకు జైలుకి వెళ్లలేదు.