ముడిచమురు ఎగుమతిలో భారత్ ముందంజ
- శుద్ధి చేసిన ముడి చమురు ఎగుమతిలో సౌదీ అరేబియాను వెనక్కి నెట్టిన భారత్
- భారీ తగ్గింపుతో భారత్‌కు ముడి చమురును అందిస్తున్న రష్యా
- గత ఆర్ధిక సంవత్సరంలో రష్యాకు కీలక మార్కెట్‌గా భారత్
2023 ఆర్ధిక సంవత్సరంలో రష్యాకు భారత్ కీలక మార్కెట్‌గా మారింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా భారీ తగ్గింపుతో ముడి చమురును భారత్‌కు అందించింది. పలు దేశాల నుండి విమర్శలు వచ్చినప్పటికీ రష్యా నుంచే భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి 3.35 బిలియన్లు, సౌదీ నుంచి 2.30 బిలియన్లు, ఇరాక్ నుంచి 2.03 బిలియన్ డాలర్ల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటుంది. దీంతో భారతీయ రిఫైనరీలు హైక్వాలిటీ పెట్రోల్, డీజిల్ ఇతర శుద్ధి చేసిన ఉత్పత్తులతో సరఫరా గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా సౌదీ ఆరిబియాను కాదని భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి.