South Africa: టీమిండియాతో టీ20 సిరీస్ కు దక్షిణాఫ్రికా జట్టు ఎంపిక

South Africa team announced for T20 Series with Team India
  • టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 4 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • నవంబరు 8 నుంచి సిరీస్ ఆరంభం
  • సిరీస్ కు ఆతిథ్యమివ్వనున్న దక్షిణాఫ్రికా
ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఎంతటి ఆసక్తికర పోరు జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ టైటిల్ సమరంలో టీమిండియా 7 పరుగుల తేడాతో సఫారీలను ఓడించి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఆ మెగా టోర్నీ తర్వాత టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటిదాకా టీ20ల్లో తలపడలేదు. తాజాగా, ఈ రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది. 

నవంబరు 8 నుంచి మొదలయ్యే ఈ సిరీస్ కు దక్షిణాఫ్రికా ఆతిథ్యమిస్తోంది. ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. నాలుగు టీ20 మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఆడే దక్షిణాఫ్రికా జట్టుకు సీనియర్ బ్యాట్స్ మన్ ఐడెన్ మార్ క్రమ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్ వంటి విధ్వంసకర బ్యాటర్లతో... మార్కో యన్సెన్, గెరాల్డ్ కోట్జీ వంటి ప్రతిభావంతులైన పేసర్లతో సఫారీ జట్టు బలంగా కనిపిస్తోంది. 

దక్షిణాఫ్రికా జట్టు...
ఐడెన్ మార్ క్రమ్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, ట్రిస్టాన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఓట్నీల్ బార్ట్ మన్, గెరాల్డ్ కోట్జీ, డోనోవాన్ ఫెరీరా, పాట్రిక్ క్రూగర్, మార్కో యన్సెన్, కేశవ్ మహరాజ్, మిహ్లాలీ ఎంపోగ్వానా, ఎన్ కబా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిలే సిమిలానే, లూథో సిపామ్లా (3,4వ టీ20లకు).
South Africa
Team
T20 Series
Team India

More Telugu News