'పుష్ప-2' నుంచి రొమాంటిక్ పోస్టర్
- అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 'పుష్ప-2'
- దీపావళి సందర్భంగా రొమాంటిక్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
- డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు సినిమా
- తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల
ఇక ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. కాగా, ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నెగెటివ్ రోల్లో నటిస్తున్నారు. ఆయనతో పాటు రావు రమేశ్, సునీల్, అనసూయ భరద్వాజ్, జగపతిబాబు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది.