మంత్రి పొంగులేటి టార్గెట్గా కేటీఆర్ కీలక ట్వీట్
- తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉందని కేటీఆర్ ఆరోపణ
- ఈడీ దాడుల తర్వాత ఆదానీతో పొంగులేటి రహస్యంగా భేటీ అయ్యారన్న కేటీఆర్
- ఈడీ దాడుల్లో భారీగా డబ్బు దొరికినట్లు మీడియాలో కథనాలు వచ్చాయన్న కేటీఆర్
ఈడీ దాడులు జరిగి నెల రోజులు కావస్తున్నా కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉన్నందునే ఈడీ దాడులపై బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట కూడా లేదన్నారు. ఈడీ దాడుల్లో భారీగా డబ్బు దొరికినట్లుగా మీడియాలో వార్తలు వచ్చినా కేసు నమోదు కాలేదన్నారు. ఈడీ దాడులు ముగిసిన తర్వాత హైదరాబాద్ లో ఆదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా భేటీ అయ్యారన్నారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్విడ్ ప్రోకో కాక మరేమిటి? అని కేటీఆర్ ప్రశ్నించారు.