టీటీడీ అధికారులపై శ్రీనివాసానంద సరస్వతి వ్యాఖ్యలు... టీటీడీ స్పందన
- టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిపై ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపణలు
- స్వామీజీ అడిగిన మేర దర్శనం టికెట్లు ఇవ్వలేదన్న కోపంతో ఆరోపణలు చేశారన్న టీటీడీ
- అధికారిని కించపరుస్తూ మాట్లాడటం స్వామీజీ స్థాయికి తగదన్న టీటీడీ
అయితే సాధారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ఆ రోజున దర్శనం కొరకు ఇంత మందికి ఇవ్వడం సాధ్యం కాదని, 600 మంది సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారని, అయితే సదరు స్వామీజీ తాము అడిగిన 600 మందికి దర్శనం కల్పించాలని పట్టుబట్టడం జరిగిందని టీటీడీ తెలిపింది. తాము అడిగినంతమందికి శ్రీవారి దర్శనం టికెట్లు ఇవ్వలేదన్న కోపంతో మీడియా సమక్షంలో టీటీడీ అధికారిని తీవ్ర స్థాయిలో కించపరుస్తూ స్వామీజీ మాట్లాడారని, ఇది స్వామీజీ స్థాయికి తగదని టీటీడీ పేర్కొంది.