జగన్ తన పదవీకాలమంతా వసూళ్లతోనే గడిపారు: మాణికం ఠాగూర్
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ తన పదవీకాలమంతా వసూళ్లతోనే గడిపారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారమే వైఎస్ఆర్ మొదటి ప్రాధాన్యత అంటూ వైసీపీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేసింది. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు.
"జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ధనవంతుల్నే కలిసేవారు. ప్రజా దర్బార్ పేరిట ప్రజల సమస్యలు తెలుసుకునే ఆలోచన చేయలేదు. నిజానికి జగన్ ఎప్పుడూ వైఎస్‌ను అనుసరించలేదు. తన పదవీకాలమంతా జగన్ వసూళ్లతోనే గడిపారు" అని మాణికం ఠాగూర్ పేర్కొన్నారు.