బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ, డ్రగ్స్‌పై కేటీఆర్ ఏం చెబుతారు?: బండి సంజయ్

Bandi Sanjay questions KTR over Rave Party
  • బావమరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్ పార్టీలు నిర్వహిస్తారా? అని బండి నిలదీత
  • డ్రగ్స్ తీసుకొని దొరికినా కేటీఆర్ బుకాయిస్తాడేమోనని ఆగ్రహం
  • ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్
తన బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ, డ్రగ్స్ దొరికిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం సమాధానం చెబుతారని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్‌లోనే రేవ్ పార్టీల నిర్వహణా? అని మండిపడ్డారు. డ్రగ్స్ తీసుకొని దొరికినా కేటీఆర్ బుకాయిస్తాడేమోనని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక్కడి సీసీ ఫుటేజీ, ఆధారాలు ధ్వంసం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారు ఎంతటి వారైనా అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఈ కేసులో సుద్దపూసను కావాలనే తప్పించారనే ప్రచారం సాగుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అందరిపైనా చర్యలు తీసుకొని చట్టం ముందు అందరూ సమానమేనని ప్రభుత్వం నిరూపించాలని కోరారు. యువతను భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్ విషయంలో రాజీ ధోరణి వద్దని కేంద్రమంత్రి సూచించారు.
Go Back to Shorts
Bandi Sanjay
BJP
KTR
Congress

More Telugu News