జియో ధమాకా ఆఫర్.. ‘భారత్’ ఫీచర్ ఫోన్ల ధరపై భారీ డిస్కౌంట్
- రూ.999 నుంచి రూ.699కి తగ్గింపు
- దీపావళి ప్రత్యేక ఆఫర్ కింద తగ్గింపు
- నెలకు రూ.123 రీఛార్జ్‌తో అపరిమిత బెనిఫిట్స్ పొందొచ్చని ప్రకటన
జియో భారత్ 4జీ ఫోన్ల యూజర్లు నెలకు రూ.123 రీఛార్జ్‌తో అపరిమిత వాయిస్ కాల్స్ పొందొచ్చని, 455 టీవీ ఛానళ్లు, 14 జీబీ డేటా వంటి ఆకర్షణీయ సర్వీసులను పొందవచ్చని జియో ప్రస్తావించింది. ఫీచర్ ఫోన్ల విషయంలో ఇతర టెలికం ఆపరేటర్లు అందిస్తున్న అతి తక్కువ రీఛార్చ్‌లతో పోల్చితే జియో భారత్ ప్లాన్ దాదాపు 40 శాతం చవకైనదని పేర్కొంది. జియో యూజర్లు ప్రతి నెలా రూ.76ను ఆదా చేసుకోవచ్చని అని వివరించింది.
ఈ కొత్త ఆఫర్ ప్రత్యేకతలు ఇవే..
కేవలం రూ. 123 నెలవారీ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, నెలకు 14 జీబీ డేటా, 455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానళ్లు, మూవీ ప్రీమియర్‌లు, లేటెస్ట్ సినిమాలు, వీడియో షోలు, స్పోర్ట్స్ లైవ్స్ చూడొచ్చు. అంతేకాదు జియో సినిమాలోని కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఈ ఫోన్‌ను ఉపయోగించి క్యూఆర్ కోడ్ స్కాన్‌లతో డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. అంతేకాదు పేమెంట్స్ స్వీకరించవచ్చు. జియో చాట్‌లో వీడియోలు, ఫొటోలు, మెసేజులను షేర్ చేయవచ్చని జియో పేర్కొంది.
ఇక జియో భారత్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే ఇది 1.77 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 1000 ఎంఏహెచ్ బ్యాటరీ, టార్చ్ లైట్, ఎఫ్ఎం రేడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుకవైపు 0.3 మెగాపిక్సెల్ కెమెరా, 128జీబీ వరకు ఎస్‌డీ కార్డ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని ద్వారా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు.