ఇసుక పూర్తిగా ఉచితమని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారు: మంత్రి పార్థసారథి

ఇసుక అంశంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. ఇసుకపై వైసీపీ నేతలు చేసే ఆరోపణలను నమ్మవద్దని అన్నారు.  ఇసుక పూర్తిగా ఉచితమని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. వైసీపీ నేతల ఆరోపణలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. 

ఇసుక కావాల్సిన వారు సొంత వాహనాల్లో తీసుకెళ్లవచ్చని, ఇసుక తవ్వకాల ఖర్చులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. ఉచిత ఇసుకను దారిమళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి పార్థసారథి హెచ్చరించారు.

Free Sand
Kolusu Parthasarathy
TDP-JanaSena-BJP Alliance
YSRCP
Andhra Pradesh

More Telugu News