‘గ్రీన్ లైన్’ సమస్య ఎదుర్కొంటున్న వన్‌ప్లస్ యూజర్లకు గుడ్‌న్యూస్
- ఉచితంగా డిస్‌ప్లే మార్చుతామని ప్రకటించిన కంపెనీ
- సమీపంలోని సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలని సూచన
- గ్రీన్ లైన్ సమస్య ఎదుర్కొంటున్న వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్ యూజర్లు
‘గ్రీన్ లైన్’ సమస్యను ఎదుర్కొంటున్న యూజర్లు సమీపంలోని సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలని కంపెనీ సూచించింది. ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండా డిస్‌ప్లేలను మార్చుతామని తెలిపింది. వారెంటీ ముగిసిన ఫోన్లకు ఈ సర్వీసు వర్తిస్తుందని వెల్లడించింది. ఫోన్ల ప్రదర్శన విషయంలో జీవితకాల వారెంటీని ఇస్తున్నట్టు తెలిపింది. వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 9 సిరీస్‌లోని ఎంపిక చేసిన పలు మోడల్ ఫోన్లను ఈ సమస్య ప్రభావితం చేస్తుందని పేర్కొంది. కాగా ఈ గ్రీన్ లైన్ సమస్య వన్‌ప్లస్ ఫోన్లకు మాత్రమే పరిమితం కాలేదు. సామ్‌సంగ్, మోటరోలా, వివో స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 31న ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం గమనార్హం.