మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్
- మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా సురేశ్
- రెండ్రోజుల కస్టడీ ముగియడంతో నేడు కోర్టుకు
- నవంబర్ 4 వరకు రిమాండ్ విధించడంతో తిరిగి గుంటూరు జైలుకు తరలింపు
కస్టడీ గడువు నేటితో ముగియడంతో పోలీసులు ఆయనను తాజాగా న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. విచారించిన న్యాయస్థానం నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
2020 డిసెంబర్‌లో వెలగపూడిలో రెండు సామాజికవర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో నందిగం సురేశ్ 78వ నిందితుడిగా ఉన్నారు. కాగా, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలోనూ ఆయన కీలక నిందితుడిగా ఉన్నారు.