హైదరాబాద్‌లో బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కి ప్రమాదం
- హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన హర్యానా గవర్నర్
- శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతుండగా ప్రమాదం
- కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన ఎస్‌యూవీ
దత్తాత్రేయ కాన్వాయ్ కిషన్‌గూడ ట్రంపెట్ బ్రిడ్జి సమీపంలోకి వచ్చిన సమయంలో ఓ ఎస్‌యూవీ కాన్వాయ్ మధ్యలోకి వచ్చింది. దీంతో కాన్వాయ్‌లోని వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో అదుపుతప్పి మూడు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. సెక్యూరిటీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.
కాన్వాయ్‌లో ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దత్తాత్రేయ కారు సురక్షితంగా ముందుకు పోయేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.