అశ్లీల నృత్యాలతో యువకులకు వల.. బంజారాహిల్స్‌లో పబ్‌పై పోలీసుల దాడి
- పబ్ ముసుగులో చట్టవ్యతిరేక కార్యకలాపాలు
- యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ యువకులకు వల
- 42 మంది మహిళలు సహా 140 మంది అరెస్ట్
నిబంధనలకు విరుద్ధంగా యువతులతో నిర్వాహకులు అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 42 మంది మహిళలు సహా 140 మందిని అరెస్టు చేశారు. పబ్ నిర్వాహకులు, క్యాషియర్, డీజే ఆపరేటర్లను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువకులను ఆకర్షించి సొమ్ము చేసుకునేందుకకు వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను పబ్‌కు రప్పించినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.