తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం... 3 గంటల్లో స్పెషల్ ఎంట్రీ దర్శనం
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు
- టోకెన్లు లేకుండా వచ్చిన వారికి 8 గంటల్లో సర్వదర్శనం
- నిన్న స్వామివారికి హుండీ రూపంలో రూ.3.54 కోట్ల ఆదాయం
శుక్రవారం నాడు తిరుమల వెంకన్నను 61,576 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.54 కోట్ల ఆదాయం లభించింది.