Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సన్నీ డియోల్ 'జాత్‌' మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

Sunny Deol Jaath Movie First Look Released
Advertisement
  • సన్నీడియోల్‌ బర్త్‌డే సందర్బంగా 'జాత్‌' ఫస్ట్‌లుక్‌ 
  • యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా 'జాత్‌' 
  • తెలుగు నిర్మాతలు నిర్మిస్తున్న బాలీవుడ్‌ చిత్రమిది.
Advertisement
బాలీవుడ్‌ స్టార్‌ సన్నీడియోల్‌ మన తెలుగు దర్శకుడు గోపీంచద్‌ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి 'జాత్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అండ్‌ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతలు. శనివారం సన్నిడీయోల్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈచిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. 

ఈ ఫస్ట్‌లుక్‌లో సన్నిడియోల్‌ ను పవర్‌ఫుల్‌ యాక్షన్‌, ఇంటెన్స్‌ అవతార్‌లో ప్రజెంట్‌ చేశారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈచిత్రం రూపొందుతుందని  నిర్మాతలు హింట్‌ ఇచ్చారు. సన్నిడియోల్‌ తన శరీరమంతా బ్లడ్‌ మార్క్స్‌తో భారీ ఫ్యాన్‌ని పట్టుకుని ఉండటం ఈ పోస్టర్‌లో గమనించివచ్చు. ఈ పోస్టర్‌ చూసిన వాళ్లంతా ఇది హై ఆక్టేన్‌ డ్రామా, లార్జర్‌ దేన్‌ లైఫ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాగా ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. 

రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.  పీటర్ హెయిన్, అన్ల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్‌ యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా ఒళ్లుగగుర్పొడిచే స్టంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లను అందిస్తున్నారు. 
Advertisement
Advertisement
Jaat
Sunny Deol
Jaath Movie First Look
Mythri movie makers
People media factory

More Telugu News