Hyderabad: మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుతపులి సంచారం!... ఇదిగో వీడియో

హైదరాబాద్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. నగరంలోని మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ వెనుకాల భాగంలో కొంతమంది చిరుతపులిని చూసినట్లుగా చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ శాఖ అధికారులతో చిరుతను గాలిస్తామని వెల్లడించారు.

మియాపూర్ స్టేషన్ వద్ద చిరుత సంచారానికి సంబంధించి ఓ వీడియో ఎక్స్ వేదికగా వైరల్‌గా మారింది. చెట్ల పక్కన నుంచి చిరుత నడుస్తూ వెళుతుండగా ఎవరో వీడియోను తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Hyderabad
Leopard
Hyderabad Metro

More Telugu News